
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాఠశాలను ఈ రోజు గురువారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు,సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తో కలిసి సందర్శించారు.
ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ స్కూల్లోని ప్రతి తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులు ప్రధానంగా స్కూల్ బస్సు సౌకర్యం కల్పించాలి, బెంచ్లకు రంగులు వేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు, సింగరేణి జీ.ఎం.ను సిఎస్ఆర్ నిధుల నుంచి అవసరమైన అన్ని సౌకర్యాలను తక్షణం అందించాలి అని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సింగరేణి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.