
భూమి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి చెందినదే
ప్రముఖ శైవక్షేత్రం శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానమునకు సంక్రమించిన స్థలము దేవస్థానమునకు ప్రక్కనే సర్వేనెంబరు 991, 4ఎకరముల 11 గుంటల స్థలం ఉంది ఇట్టి స్థలాన్ని అట్టి అర్చకులు,భక్తులు, నాయకులు దేవాదాయశాఖ కలిసి 1982 నుండి ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించిగా రికార్డులను పరిశీలించి గత 6నెలల క్రితం అప్పటి వరకు జరిగిన వాదోపవాదములను పునః పరిశీలించి న్యాయం వెలువరించాలని హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు.హైకోర్టు ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పలు దఫాలుగా విచారణ జరిపి రికార్డులన్నింటినీ పరిశీలించి ఈ స్థలo శ్రీకుంకుమేశ్వర స్వామి వారిదేనని తీర్పు ఇవ్వడము జరిగింది.2006 నుండి పరకాల మున్సిపాలిటీ వారు దేవస్థానము వారి నుండి స్థలాన్ని లీజు తీసుకొని పశువుల సంత నిర్వహిస్తున్నారు. గత
బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేవస్థానం చైర్మన్ గా వ్యవహరించిన గందే వెంకటేశ్వర్లు కుంకుమేశ్వర స్వామికి సంబంధించిన నాలుగు ఎకరాల భూ వ్యవహారంపై పలుసార్లు ప్రస్తావిస్తూ దేవదాయ శాఖకి ఫిర్యాదులు అందిస్తూ దేవస్థానం భూమిలో పరకాల మున్సిపాలిటీ వారు టెండర్ల ద్వారా పశువుల సంతను నడుపు విషయం గురించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎట్టకేలకు నేటితో కుంకుమేశ్వర స్వామి దేవస్థానంకు చెందినదిగా తీర్పు రావడంతో పరకాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.