భోగి సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రి జలగం
కోలాటం ఆడిన జలగం”
ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ఇచ్చిన జలగం”
పల్లె సంప్రదాయాలను కనుమరుగు కానివ్వం:గొర్ల సత్యనారాయణరెడ్డి(గ్రామ ఉప సర్పంచ్)
చూడముచ్చటగా మూడు రోజులు పండుగ చేద్దాం: నల్లెబోయిన అంజమ్మచిన్న కృష్ణ(గ్రామ సర్పంచ్)
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో గల చౌడవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సంక్రాంతి సంబురాల వేడుకలలో బుదవారం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి,ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జలగం వెంగళరావు తనయుడు మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా వేకువ జామునే ప్రారంభించిన భోగి మంటల వద్ద యువతులు, మహిళలు ఆడిన కోలాటంలో జలగం కోలాటం ఆడి చూపరులను ఆకట్టుకున్నారు.
అనంతరం నిర్వహించిన మెగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను ఆయన చేతులమీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడే తెలుగోళ్ల పండుగ సంక్రాంతి అన్నారు.సుఖ సంతోషాలకు,భోగ భాగ్యాలకు,మమతానురాగాలకు,అప్యాయతలకు చిహ్నంగా మూడురోజుల పండుగ నిలుస్తుందన్నారు.గ్రామ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కార్యక్రమ నిర్వాహకులు,గ్రామ ఉప సర్పంచ్ గొర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ పల్లె సంప్రదాయాలను కనుమరుగు కానివ్వకుండా పండుగలను కుల,మతాలకతీతంగా,
రాజకీయాలకతీతంగా అందరమొక్కటిగా నిర్వహించుకున్నే దానికి శ్రీకారం చుట్టామని గ్రామ ప్రజలు సహకారం మెండుగా ఉందన్నారు.మంచి చెడులను ఐక్యతతో ఎదుర్కొంటూ ప్రభుత్వం నుండి గ్రామానికి రావాల్సిన సంక్షేమ పథకాలను,నిధులను రాబట్టడానికి,అనుక్షణం గ్రామ ప్రజలకు అండగా ఉంటూ సుపరిపాలన అందించే దానికి కంకణం కట్టుకున్నామని తెలుపుతూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా పాల్గొన్న జలగం ప్రసాదరావు కు కృతజ్ఞత తెలుపుతూ శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం గ్రామ సర్పంచ్ నల్లెబోయిన అంజమ్మచిన్నకృష్ణ మాట్లాడుతూ ఎటువంటి మనస్పర్థలు లేకుండా అందరమొక్కటిగా మూడురోజుల పండుగ ను గ్రామంలో చూడముచ్చటగా చేద్దామని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.గోమాతను పూజిస్తూ,దేవాధీదేవతలను సంప్రదాయ పద్ధతిలో పూజిస్తూ, మన నుండి దూరమైన ఇంటి పెద్దలను గుర్తు చేసుకుంటూ అన్యోన్యంగా జరుపుకోవాలని,మత సామరస్యానికి ప్రతీకగా గ్రామాన్ని నిలబెట్టడానికి అందరు కృషి చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో: పల్లెవాడ గ్రామ
సర్పంచ్ పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్,మాజీ సర్పంచులు,వార్డు సభ్యులు,సహకార సంఘం డైరెక్టర్లు,ప్రజలు,జలగం అభిమానులు,జమలయ్య తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.