సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి
సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి…..~~~~~
బాణాపురం :- వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు భక్తులు రసాయనాలు కలిపి తయారుచేసిన వినాయకులని విగ్రహాలను ప్రతిష్టచ కుండ స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నీటి కాలుష్యాన్ని పర్యావరణాన్ని ప్రకృతిని ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పిలుపునిచ్చారు.
ఈరోజు జనగామ పట్టణంలోని ఐదో వార్డు లోని బాణపురం ఇందిరమ్మ కాలనీలో ధర్మ కంచె 16వార్డులో గో గ్రీన్ జనగామ సంస్థ ఫౌండర్ పంతం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను,కొబ్బరికాయ ఊది బత్తిలను ఉచితంగా పంపిణీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఆటో ట్రాన్స్పోర్ట్ ట్రాలీ యూనియన్ CITU నాయకులు ధరావత్ మహేందర్ నాయక్ అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా బూడిది గోపి మాట్లాడుతు నీటి కాలుష్యాన్ని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పర్యావరణ సమతుల్యత పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని అన్నారు.రసాయనాలు అధిక మోతాదులో ఉన్న విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా సమయం తీసుకుంటాయని అంతేకాకుండా వాటి తయారీలో వాడినా కెమికల్స్ వల్ల నీటిలో ఉండే జీవరాసులు చేపలు జంతుజాలంపై ప్రభావం పడుతుంది.ఆనీళ్లు భూగర్భంలో ఇంకుతున్న సందర్భంలో గాఢతో కూడిన మూలకాలుగా మారతాయని ఆనీటి వల్ల మానవజాతి కూడా కెమికల్ రియాక్షన్ ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారని వివరించారు. అందుకోసం బాధ్యతగా అందరం ఉండాలని మట్టి వినాయకుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు.
ఈసందర్భంగా గో గ్రీన్ జనగామ ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో గో గ్రీన్ ఫౌండర్ మెంబర్స్ చింతకింది అజయ్ కుమార్ ములుగు ఆకర్ష్ దోపతి సాయి చరణ్ చారి ప్రభుదాస్ గుగ్గిళ్ళ పద్మ ఇంజ అపర్ణ చింతకింది శ్రీను ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.