మడుపల్లి గ్రామంలో సీపీఎం పార్టీ అభ్యర్థి పాలడుగు భాస్కర్ కి ఘన స్వాగతం
Uncategorizedగ్రామంలో సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్ పాలడుగు భాస్కర్ మడుపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు, గ్రామ ప్రజలు కార్యకర్తలు సానుభూతిపరులు పూల మాలలు వేసి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో భాస్కర్ మాట్లాడుతూ మడుపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. దీనికి టిఆర్ఎస్ పార్టీ మడుపల్లిని మున్సిపాలిటీలో కలపటానికి సహకరించిందన్నారు. దీంతో ప్రజలు బాధలు పెరిగినవి తప్ప అభివృద్ధి ఏమీ జరగలేదఅన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించలేని కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, టిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజుకు ఓటు వేస్తే ఆ ఓటు ప్రజా సమస్యలను పరిష్కరించలేదని, ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని తెలిపారు. అందుకని ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి సిపిఎం పార్టీని ఆదరించి సిపిఎం పార్టీ అభ్యర్థిని అయిన నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పుచ్చకాయల అప్పారావు .పుచ్చకాయల కిషోర్ ,అప్పన శ్రీను శాఖ కార్యదర్శి నాగేశ్వరరావు కృష్ణకుమారి సాది వెంకట రావమ్మా .మధిర సీపీఎం పట్టణ కార్యదర్శి ఫణీంద్ర కుమారి మధిర మండల కార్యదర్శి సైదులు ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తేలప్రోలు రాధాకృష్ణ మధిర పట్టణ నాయకులు పలికంటి వెల్సన్ కృష్ణ తుమ్మవరపు రాములు .టీ.వెంకటేశ్వర్లు కర్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.