మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, డోర్నకల్ నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా సంగీత గెలుపు కోసం మరిపెడ మండలములో బిజెపి మండల అధ్యక్షులు బింగి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆనేపురం , నిలికూర్తి గ్రామాలలో తిరుగుతూ బిజెపి పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇతర పార్టీల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కానివి అని అన్ని వర్గాల ప్రజలు బిజెపి మేనిఫెస్టోను స్వాగతిస్తున్నారని మోడీ నాయకత్వం మీద పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు . స్థానికురాలు విద్యావంతులైనటువంటి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య సంగీతను కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేసినారు. ఈ ప్రచార కార్యక్రమంలో మరిపెడ మండల ఉపాధ్యక్షుడు అనంతుల సురేష్ గౌడ్ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శులు ఆకుల హరికృష్ణ, గంగాధర్, బిజెయంమ్ మండల అధ్యక్షులు బోడ రమేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఏనుగు తల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.