మరిపెడ మండలం లో ఏకగ్రీవం ఐన కాంగ్రెస్ సర్పంచ్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ధరావత్ తండా గ్రామ పంచాయతీకి ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధరావత్ తండాకు చెందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దరావత్ తేజ్యా ఒక్కడే నామినేషన్ దాఖాలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా తేజ్య నాయక్ మాట్లాడుతూ తండా అభివృద్ధి కోసం పనిచేస్తానని మా తండా లో గ్రామ పంచాయతీ కి రెండు గుంటల భూమి ని, అదే విధంగా సి సి రోడ్డు ను వేపిస్తా అని, ముందు రోజులు లలో తండాను ఏమ్మెల్యే రామచంద్ర నాయక్, జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పథం లోకి తీసుకెళ్తా అని తెలిపారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ను తండా వాసులకు వచ్చే విధంగా చూస్తా అని అన్నారు.