
మల్లేశ్వరి ఆత్మహత్య నిందితులను అరెస్ట్ చేయాలి–ఐద్వా డిమాండ్
ఈ69న్యూస్ నల్లగొండ: మల్లేశ్వరి ఆత్మహత్యకు కారణమైన జాన్ రెడ్డి సహా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని,ఏసీపీని సస్పెండ్ చేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు.మంగళవారం దొడ్డి కొమురయ్య భవనంలో జరిగిన ఐద్వా జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..మల్లేశ్వరి రాసిన సూసైడ్ నోట్ లోని అంశాలను దృష్టిలో ఉంచుకొని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.మహిళలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.