విశిష్ట అతిథులుగా ఎంపీ డా. కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ ఈ69న్యూస్:జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామంలో మహంకాళి అమ్మవారి మరియు పోచమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య,స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై,ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు.పూర్ణాహుతి అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు.ఈ వేడుకలో గ్రామస్తులు,మహిళలు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.