
మహబూబాబాద్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రెవెన్యూ–హౌసింగ్–సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy మరియు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి Konda Surekha పాల్గొన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి కార్యక్రమాల పురోగతిపై వారు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలని అధికారులకు సూచించారు.