మహా రుద్రాయగ ఏర్పాట్ల పరిశీలన
అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరగాలి ఎక్కడ దేనికి లోటు లేకుండా భక్తులకు అనుకూలంగా జరగాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు.
అలాగే ఈ యాగానికి ఒక పరకాల నియోజకవర్గ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల భూపాలపల్లి, హుజురాబాద్,హన్మకొండ ప్రజలకు కుడా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.
ఈ యాగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మారి ముక్యంగా ఈ పరకాల ప్రాంత ప్రజల శ్రేయస్సు రైతుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పరకాల ప్రాంతం అభివృద్ధి కోసం ఈ యాగానికి నిదర్శనమని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమాన్ని శ్రీ కుంకుమేశ్వర స్వామి పూజారులు,పాలక వర్గం మరియు ఉత్సహవంతులు మహా రుద్ర యాగాన్ని నిర్వహించడం భోజన సౌకర్యాలు కుడా పెట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే రేవూరి అన్నారు.
తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రాహ్మణులూ కుడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరుగుతుందని అన్నారు.
మరి ముఖ్యమైన విషయం 4 ఎకరాల 11గుంటల భూమి కుంకుమేశ్వర స్వామి ఆలయ భూమి దీని మీద ఖండించినవాళ్ళు కుడా ఉన్నారని అన్నారు. కొంతమంది చనిపోయారని కుడా వారు అన్నారు భగవంతుడే దీనికి సమాధానం చెప్తాడని అన్నారు. ఈ భూమి ఎమ్మెల్యేగా నా హయాంలో శ్రీ కుంకుమేశ్వర స్వామికీ దక్కడం హర్షించదగా విషయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగురు రాజేశ్వర్ రావు మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి అలాగే పరకాల ఆర్డిఓ, కాంగ్రేస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.