ఆర్.కె సాంస్కృతిక ఫౌండేషన్ "భారతీయ కళా వైభవం" అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కారం-2022 ఎంపికైన మాతృభాష పరిరక్షణ సమితి అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి ఆర్.కే. సాంస్కృతిక ఫౌండేషన్ భారతీయ కళా వైభవం ఆధ్వర్యంలో దివి:20-02-2022రోజున హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మాతృ భాష అభివృద్ధి పట్ల మాతృభాష పరిరక్షణ పట్ల కృషి చేస్తూ, తెలుగు భాష అభివృద్ధికి పాటుపడుతూ ఒక ఉపాధ్యాయునిగా, కవి ,రచయితగా విశేష సేవలు అందించి నటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ గ్రామ నివాసి అయిన డా.సామల శశిధర్ రెడ్డి గారిని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కారం-2022 కి గాను ఎంపిక చేస్తున్నట్లు ఆర్.కే సాంస్కృతిక ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రంజిత్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తేదీ 20-02- 2022 రోజున హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు ఈ పురస్కారాన్ని డా.సామల శశిధర్ రెడ్డి గారికి అందిస్తున్నట్లు రంజిత్ కుమార్ పేర్కొన్నారు.