మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది-డా. రాజయ్య ఈ69హన్మకొండ: రెవంత్ రెడ్డి ప్రభుత్వం 17 నెలలు అయినా మాదిగల కోసం ఒక్క పథకం తీసుకురాలేదని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు.ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని,ఎంపికలు గ్రామ సభలో కాకుండా కడియం అనుచరుల ఇళ్లలో జరుగుతున్నాయన్నారు.కడియం శ్రీహరి గతంలో మాదిగ నేతలను ఎదగనివ్వలేదని,దళితులను ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేశారని ఆరోపించారు.మంత్రి వర్గంలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు.మాదిగలకు 35 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.