మానవత్వం చాటుకున్న కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు
గీసుగొండ మండలంలోని మనుగొండ గ్రామం
చంద్రాయపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి..మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు ఏర్పడకుండా మరియు ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తప్పించడం కష్టంగా ఉండటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో పిచ్చి చెట్లను తొలగించారు. ముఖ్యంగా ఆ రహదారి వైపు పంట పొలాలు ఉన్న మనుగొండ గ్రామ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని..ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా…గీసుకొండ మండల కాంగ్రెస్ నాయకులు కొమ్ము. శ్రీకాంత్ గారు ..తన సొంత ఖర్చులతో ..మనుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆ పిచ్చి చెట్లని తొలగించడం జరిగింది…ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్,మనుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందికొండ, రాజు, కాగిత అఖిల్,తదితరులు పాల్గొన్నారు.