ఈ69న్యూస్: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య మరోసారి తన మానవతా విలువలను చాటిచెప్పారు.గురువారం పరకాల పర్యటనలో భాగంగా హనుమకొండ నుంచి పరకాల వెళ్తున్న సమయంలో,దామెర మండలంలోని సైలాని బాబా దర్గా సమీపంలో జరిగిన బైక్ ప్రమాదాన్ని గమనించి తక్షణమే తన వాహనాన్ని ఆపారు.తీవ్రంగా గాయపడిన బాధితులను చూశారు.ఒక వైద్యురాలిగా,క్రమశిక్షణ గల ప్రజాప్రతినిధిగా,డాక్టర్ కావ్య సంఘటన స్థలంలోనే గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు.వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి,సమీపంలోని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత వైద్య అధికారులకు సూచనలు ఇచ్చారు.ప్రజల్లో మానవత్వం,సేవా భావానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలిచింది.గతంలోనూ డాక్టర్ కావ్య ఇటువంటి సంఘటనల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి,ప్రాణాలను కాపాడిన ఘటనలు ఉన్నాయి.ప్రజాప్రతినిధిగా మాత్రమే కాక,డాక్టరుగా కూడా బాధ్యతను నిర్వర్తిస్తున్న డా.కడియం కావ్య ఈ ఘటనలో తన సేవా ధృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు.