అనంతరం మంత్రి మాట్లాడుతూ
కొరిటికల్ గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు చేసాము.సబ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. సీసీ రోడ్లు వేయించాము. దేవాలయాలు కట్టించాము కెనాల్ వాటర్ ఇప్పిస్తున్నాము.బీజేపీ నేత మహేష్ రెడ్డి నా మీద భూమి ఆక్రమించు కున్నానని ఆరోపణలు చేస్తున్నాడు.మహేష్ రెడ్డీ నీకు దమ్ముంటే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గుంట భూమి ఆక్రమించు కున్నాడని నిరూపించు. నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు.మీకు అభివృద్ధి చేసిన BRS పార్టీకి మూడో సారి అధికారం ఇవ్వండి. అందరూ కారు గుర్తుకు ఓట్లు వేయండని అన్నారు.