ఈ69న్యూస్ హన్మకొండ దశాబ్దాలుగా వరంగల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మానదిశ చూపింది.ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిమిత్తం రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం,ఈ ప్రాజెక్ట్ పురోగతిలో ఒక కీలక మలుపుగా భావించవచ్చు.ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ..‘‘విమానాశ్రయం నిర్మాణానికి సాంకేతికంగా ఎదురవుతున్న 150 కిలోమీటర్ల పరిమితిపై కేంద్రం నుంచి ఇప్పటికే అనుమతి లభించగా,ఇప్పుడు నిధుల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిబద్ధతను నిరూపించింది’’ అని పేర్కొన్నారు.వరంగల్‌కు చారిత్రకంగా ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసిన ఆమె,ఈ నిర్మాణం వల్ల ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.‘‘ఇది కేవలం నిర్మాణం మాత్రమే కాదు… వరంగల్ ప్రజల ఆకాంక్షలకు ప్రత్యక్ష సాక్ష్యం’’అని అన్నారు.అదేసమయంలో కేంద్ర విమానయాన శాఖ కూడా వెంటనే స్పందించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ అభివృద్ధి నిర్ణయంపై వరంగల్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.