మార్పు మొదలైంది గెలుపు డిసైడైంది
అందరి చూపు 1 వార్డు వైపే.
1వ వార్డులో ప్రజల అవధులు లేని ఆదరణ.
ఆకట్టుకుంటున్న బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లునవత్ రవి నాయక్ విస్తృత ప్రచారంతో ముందుకు సాగుతూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. డిఎస్ రెడ్యానాయక్ నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆశీస్సులతో 1వ వార్డులో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ఇంచార్జి గుగులోత్ రాంబాబు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి రెండున్నర ఏళ్లుగా కాలయాపన తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడం దాచుకోవడమే తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. విద్యావంతులమైన తాము ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వస్తున్నామని తెలిపారు. వార్డులోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ గా గెలిపించి మున్సిపాలిటీకి పంపాలని కోరారు.1వ వార్డు ప్రజలు తమని ఆదరించి అత్యధిక మెజారిటీతోని గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను వేడుకున్నారు.ఈ మాజీ ఎంపీపీ గడ్డం వెంకన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుగులోత్ రాంబాబు నాయక్,లునవత్ వెంకన్న నాయక్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.