మా హక్కులను యధావిధిగా కొనసాగించాలి
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ రేణుక, ఎల్లమ్మ, ఆలయం దగ్గర తరతరాలుగా గ్రామ హరిజన కులస్తులకు ఉన్న ధూప దీప నైవేద్య సేవహక్కులను మా కులస్తులకే చెందుతుంది ప్రతి ఏటా అందరి ప్రాతినిధ్యం వచ్చేలా వంతుల వారీగా పాత ఎల్లమ్మ ఆలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఎప్పుడు లేని విధంగా ఆలయంలోకి మమ్ములను అనుమతించకుండా స్థానిక పూజారుల అడ్డుకుంటున్నారు అంతేకాక ప్రతి ఏటా ఆలయ ప్రధాన ద్వారం వద్ద మేము చేసే దీప ధూప నైవేద్యం సేవా కార్యక్రమం సైతం మమ్మల్ని చేయకుండా అడ్డుకుండు మా జీవనోపాధికి ఆటంకం కలిగిస్తున్నములను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో విధిగా మాకున్న సేవా విధులపై మాకు ఉన్న హక్కులను యధావిధిగా కొనసాగిస్తూ మాకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు వినతి పత్రం హరిజన సోదరులు అందజేశారు. న్యాయం చేయాలని తెలిపారు.