
మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి-ఐద్వా,పి.ఓ.డబ్ల్యూ,డివైఎఫ్ఐ డిమాండ్
ఈ69న్యూస్ నల్లగొండ: హైదరాబాద్లో మే 7 నుంచి జరగనున్న మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు తక్షణమే రద్దు చేయాలని ఐద్వా, పి.ఓ.డబ్ల్యూ, డివైఎఫ్ఐ, పీవైఎల్, పిడిఎస్యు సంఘాలు డిమాండ్ చేశాయి. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్లజెండాలతో రాస్తారోకో నిర్వహించారు.
సంఘాల నాయకులు మాట్లాడుతూ, మహిళల శరీర సౌందర్యాన్ని వాణిజ్య ప్రదర్శనలుగా మార్చే ఈ పోటీలు సమాజానికి దురుద్దేశపూరితమైనవి అని, వాటి కోసం ఖర్చు చేసే నిధులు ఆరోగ్యం, విద్య వంటి అవసరాల కోసం వినియోగించాలని తెలిపారు.