ముఖ్యమంత్రి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి-వెన్నంపల్లి
రేగొండ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బిజెపి శ్రేణులు విఫల యత్నం చేయగా రేగొండ పోలీసులు వారి చర్యను అడ్డుకున్నారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య హాజరై మాట్లాడుతూ నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పాపయ్య తప్పుపట్టారు.ఆయన మాటలు సైన్యాన్ని దేశాన్ని అవమానించేలా ఉన్నాయని తక్షణమే దేశానికి సైన్యానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.లేని పక్షాన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి,కిషన్ మోర్చా అధ్యక్షులు పొల్సాని తిరుపతిరావు,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలిఫ్,జిల్లా నాయకులు కాంతల నారాయణరెడ్డి ,ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు జగ్గన్న,మండల ప్రధాన కార్యదర్శి దయ్యాల కిరణ్,మండల ఉపాధ్యక్షులు ఎల్లావుల రాజు,సర్వ్ కుమార్ మండల నాయకుడు సాధు దేవేందర్,శ్రీనివాస్ గౌడ్,సత్యం గౌడ్,బీజేవైఎం నాయకులు దేశ్మీ రాజు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.