ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యేల బృందం…
Uncategorizedహైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, కేఆర్. నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం గారితో చర్చించారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలను స్థాపించడం ద్వారా రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడానికి మరియు క్రీడలను ప్రోత్సహించడానికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి క్రీడలలో ప్రాతినిధ్యం వహించిన అనేక మంది క్రీడా దిగ్గజాలు ఉన్నారని, వారిలో చాలా మందికి కేంద్ర ప్రభుత్వం నుండి అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా లభించాయని సీఎం గారికి వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉందని, ఇందులో జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలు మరియు ఆటలకు సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ స్టేడియం రాష్ట్ర మరియు జిల్లా స్థాయి విద్యార్థులు/ ప్రాంతీయ క్రీడాకారులు వారి సాధారణ శిక్షణ కోసం ఉపయోగించబడుతుందని తెలిపారు. ప్రస్తుతం వరంగల్ మహా నగరం అన్ని వైపులా విస్తరిస్తూ జనాభా పెరుగుతోందని, కావున ప్రస్తుత స్టేడియం క్రీడాకారుల అవసరాలను తీర్చలేక పోతుందని వివరించారు. అందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ క్రీడా పాఠశాలను మంజూరు చేయవలసిన అవసరం ఉందని ఇది విద్యా అభ్యాసం, ప్రత్యేక క్రీడా శిక్షణలు, రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, అథ్లెట్లపై దృష్టి పెడుతుందని కోరారు. క్రీడా పాఠశాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ (KUDA) భూమి ధర్మసాగర్ మండలం ఉన్నికిచెర్ల గ్రామంలోని సర్వే. నెం. 325లో 20 ఎకరాల భూమి జాతీయ రహదారి 163కి అనుకోని నగరానికి దగ్గరగా అందుబాటులో ఉందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండవ అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వరంగల్ ఉత్తర తెలంగాణలో ఒక విద్యా కేంద్రంగా ఉందని, ఇక్కడ NIT, కాకతీయ విశ్వవిద్యాలయం, డాక్టర్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 3 మెడికల్ కాలేజీలు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని తెలిపారు. క్రీడా రంగంలో క్రికెట్ అత్యంత ప్రాముఖ్యత క్రీడ కావడంతో చాలా మంది యువత మరియు విద్యార్థులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతున్నారని మీక తెలుసని అందువల్ల వరంగల్లో ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలనీ యువత మరియు విద్యార్థుల నుండి డిమాండ్ ఉందని తెలిపారు. వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారాని, అందులో భాగంగానే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విమానాశ్రయం, ఇన్నర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్, మెగా టెక్స్టైల్ పార్క్ మొదలైన వాటికి భారీ నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే వరంగల్ నగరంలో ప్రత్యేక క్రికెట్ స్టేడియం మంజూరు చేస్తే వరంగల్ మహా నగరానికి మనిహారంగా మారుతుందని కోరారు. హనుమకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, ఉన్నికిచెర్ల గ్రామంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల ప్రభుత్వ (KUDA) భూమి అందుబాటులో ఉందని, ఇది జాతీయ రహదారి 163కి ఆనుకుని ఉందని తెలియజేశారు.
కావున వరంగల్ నగరానికి తెలంగాణ క్రీడా పాఠశాల మరియు ప్రత్యేక క్రికెట్ స్టేడియంను వీలైనంత తొందరగా మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి సారథ్యంలోని ఎమ్మెల్యేల బృందం చేసిన విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత శాఖ సెక్రెటరీకి ఫోన్ చేసి వరంగల్ నగరంలో తెలంగాణ క్రీడా పాఠశాల మరియు క్రికెట్ స్టేడియం ఏర్పాటు ప్రత్తిపాదనలు పరిశీలించి అందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ నగరాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, అతి త్వరలో క్రీడా పాఠశాల మరియు క్రికెట్ స్టేడియం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందుకు ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.