ముప్పారం వాగులో మృత దేహం
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీప వాగులో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి పడడంతో గ్రామంలో కలకలం రేగింది.ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహించాయి.ఈ వరదల కారణంగా మృతి చెందిన వ్యక్తి కొట్టుకుపోయి ఇక్కడికి చేరి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.స్థానికులు వాగులో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న ధర్మసాగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు.మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.