ముమ్మరంగా వాహనాల తనిఖీలు
పట్టణంలో భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోచమ్మ మైదాన్ సెంటర్లో నాకాబందీ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఏసీపీ ఇంతేజార్ గంజ్,సీఐ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేపట్టారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ నేతృత్వంలో వాహనాల విస్తృత తనిఖీలు నిర్వహించగా,డ్రైవింగ్ లైసెన్స్,వాహన పత్రాలు,హెల్మెట్,సీటుబెల్ట్ తదితర అంశాలను పోలీసులు పరిశీలించారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని,రహదారులపై సురక్షితంగా ప్రయాణించాలన్నారు.