అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ముషీరాబాద్ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీల్లో 55 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వందల రకాల వంటకాలు ఈ స్టాల్స్ లో ప్రదర్శన చేశారు. ముఖ్యంగా యువతులు, విద్యార్థులు తామే వంటలు చేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి M D అబ్బాస్ పాల్గొన్నారు. ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, సహయ కార్యదర్శి రఫత్ అంజుమ్, నాయకులు యాకూబ్, ఇబ్రహీం, కెవిపిఎస్ నాయకులు దశరథ్, ఆవాజ్ ముషీరాబాద్ నాయకులు తన్వీర్ ఆలియా, సాజిదా రహమాన్, షేక్ రిజ్వానా, ఫరీన్ భాను, ఫిర్దోష్ బాన్,అర్షియా నాజ్, పరిహీన్ మెహదీ, అప్సరీ తబస్సుమ్, ఫౌజియా నౌషిన్, నాజియా తబస్సుమ్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.