
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో యూనిటీ&హుమనిటి గ్రూపు సభ్యులు మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన వక్కల చంద్రమౌళి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా అదే గ్రామంలో ఉన్న యూత్ సభ్యులు వారి కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో యూనిటీ,హ్యుమనిటీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు