ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండజయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన కుటుంబాలకు జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు కుటుంబసభ్యుల అందరి సహకారంతో బాగిర్తిపేట లోని మున్నూరు కాపు కులానికి చెందిన తండ్రి కొడుకులు ( సూర లింగయ్య వారి కుమారుడు సుర రాజయ్య ) కేవలం ఒక వారం వ్యవధిలో చనిపోవడం జరిగింది, భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు కుటుంబసభ్యుల అందరు సహకారంతో నిరుపేద కుటుంబానికి చెందిన వారికి 50 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది...ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు కుటుంబ సభ్యులు కౌటం రవి పటేల్,గుమ్మడి ప్రదీప్ పటేల్, గండు రమేష్ పటేల్,అనంతుల సంపత్ పటేల్, సంకటి రవి పటేల్, కోసరి రాజు పటేల్, చల్ల సతీష్ పటేల్ మరియు బాగిర్తిపేట గ్రామ మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.