మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పంతిని గ్రామ 11వ వార్డు సభ్యులు బరిగెల స్వామి తండ్రి,కొమ్మాలు మరణించగా వారి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సాయం అందించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
అనంతరం పున్నెలు నుంచి పంథిని రైతుల కోసం రోడ్డు పనులు జరుగుతుండగా స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు సమ్మేట్ట మహేష్ గౌడ్, జేబీఎం జిల్లా చైర్మన్ జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాయపురం సాంబయ్య, బండి మహేందర్, మండల యూత్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, యాకర సాంబయ్య, సమ్మెట రాజు, చిర్ర శ్రీనివాస్, మేకల సుధాకర్, బరిగెల ప్రసాద్, మేకల ప్రశాంత్, గద్దెల సుధాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.