మెుంతా తుఫాను దెబ్బతిన్న మిరప తోట
తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో మెంతా తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మిరప తోటలను ఈరోజు ఉద్యానవన శాఖ హార్టికల్చర్ అధికారిణి హెచ్ ఈ ఓ వినోద గారు పరిశీలించారు. ఈ సందర్శనలో రైతులతో పాటు భాజపా నాయకులు ఆపతి వెంకట రామారావు గారు కూడా పాల్గొని తుఫాను ప్రభావిత తోటలను పరిశీలించారు.
తుఫాను తీవ్రత వలన అన్నారుగూడెం మరియు పరిసర గ్రామాల్లో మిరప తోటలు నేల వాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆపతి వెంకట రామారావు గారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ గారికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం రైతులు కూలీలను పెట్టి తోటలను తిరిగి నిలబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని, దీనివల్ల వారికి అదనపు ఖర్చులు వస్తున్నాయని ఆయన వివరించారు.
“మిరప తోటలు తిరిగి పుంజుకుంటాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం అన్ని మిరప తోటలను విస్తృతంగా పరిశీలించి, ప్రతి ఎకరానికి తగిన నష్టపరిహారం రైతులకు అందించాలని మా విజ్ఞప్తి” అని ఆపతి వెంకట రామారావు గారు పేర్కొన్నారు.
ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ గారు రైతుల సమస్యలను సానుకూలంగా విని, ప్రభుత్వానికి తక్షణ నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ తోటల పరిశీలన కార్యక్రమంలో బీరెల్లి సామేలు, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, పిన్ని వీరయ్య, బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు, గోవిందు సురేష్, గోవిందు బాబు, విసన్నపల్లి వెంకటి, మల్లేడి రామారావు,బట్టు జనార్ధన్, సుదర్శన్, ప్రకాశం, బీరెల్లి సుధాకర్ తదితర రైతులు పాల్గొన్నారు.
మీ ఆపతి వెంకట రామారావు జిల్లా కిసాన్ మోర్చా నాయకులు నాయకులు