మొంథా తుఫాన్ వర్షానికి గూడు కోల్పోయిన నిరుపేద కుటుంబం
ఐనవోలు మండలంలో మొంతా తుపాన్ వల్ల ఐనవోలు గ్రామం లోని నిరుపేద కుటుంబమైన కందిక అనిల్ యొక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. బి ఆర్ ఎస్ పార్టీ మండల కన్వీనర్ తంపుల మోహన్ ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఐనవోలు మండలంలో కేవలం కాంగ్రెస్ నాయకులే పంచుకుంటున్నారని పేదలకు ఇండ్లు రావట్లేదాని, ప్రజా పాలన అన్ని నమ్మించి ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఏద్దేవా చేసాడు.
ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు కేటాయించాలని ఎం మ్మెల్యే, మరియు కలెక్టర్ గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో , వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపెల్లి చందర్ రావు, మాజీ సర్పంచులు ఉస్మాన్ ఆలీ, పల్లకొండ సురేష్, కంజర్ల రమేష్,మాజీ ఎంపీటీసీ కద్దురి రాజు,కో ఆప్షన్ మెంబెర్ గుంషావాలి, ఆత్మ డైరెక్టర్ కట్కూరి రాజు, దేవేందర్,సొసైటీ డైరెక్టర్ కుమార్,మాజీ ఉపసర్పంచ్ రమేష్, తీగల లక్ష్మణ్, మామిండ్ల సంపత్, తాటికాయల కుమార్,కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ, చింత అశోక్, బరిగేల ఈసాక్, మోలుగురి బాబు, జన్ను రాజు,అశోక్, రాజేంద్ర ప్రసాద్, రాజిరెడ్డి, లింగారెడ్డి, రాజశేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు