Yashaswini Mamidala(Indian National Congress(INC))
యశస్విని రెడ్డి 1997లో జన్మించింది . తల్లి పేరు మాధవి తండ్రి తిరుపతి రెడ్డి . తన స్వంత గ్రామమం చింతపల్లి అచ్చంపేట నియోజకవర్గం కాగా వారు కొత్త పేట లో స్థిరపపడ్డారు .
హైదరాబాద్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది యశస్విని రెడ్డి తదనతరం హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కుమారుడైన రాజరామోహన్ రెడ్డితో వివాహం జరిగింది . వివాహనతరం ఆమోరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు కానీ స్వగ్రామం అయ్యిన తొర్రూర్ పై ఉన్న ప్రేమతో వాళ్ళ అత్తగారు చేసే అటువంటి సామాజిక సేవ కార్యక్రమాలలో పాలు పంచుకునేది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పాఠశాలలు హాస్పిటల్ లు నిర్మాణం చేశారు తొర్రూర్ లో అనాధశ్రమం నడిపిస్తున్నారు ఇవన్నీ ఆమోరికాలో వుండి చేస్తుండడం వలన ప్రజలకు నేరుగా సేవ చేయలేక పోతున్నాం అనే భావనతో స్వంత గడ్డకి తిరిగి వచ్చారు అత్తగారు కాంగ్రెస్ కండువా కప్పుకొని రాజకీయ రంగా ప్రవేశం చేశారు ఇక్కడ పోటీ చేయడం కోసం భారత పౌరసత్వం కోసం ధరఖాస్తు చేసుకున్నారు . కాంగ్రెస్ అధిస్తానం కూడా టిక్కెట్ ఇవ్వడానికి సిద్దపడ్డారు కానీ చిక్కుముడి ఏంటి అంటే భారత పౌరసత్వం రాలేదు దీంతో వారసత్వంగా తన కోడలు ను నిలబెట్టాలి అని ఝాన్సీ రెడ్డి తన కోడలు ని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టారు అతి చిన్న వయస్కురాలుగా అసెంబ్లీ కోసం పోటీ చేసే వారిలో నిలబడింది . యశస్విని రెడ్డి తన రాజకీయ అనుభవం అంత వయసు లేనటువంటి వ్యక్తి అని ఎంత మంది ఎద్దేవా చేసిన తన మాటలతో తిప్పికొట్టింది యశస్విని రెడ్డి భారీ మొజార్టీ తో చివరికి పాలకుర్తి ఎమ్మెల్యే గా విజయం సాధించింది యశస్విని రెడ్డి .