యుద్ధాన్ని విరమించాలి–శాంతిని నెలకొల్పాలి :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
UncategorizedE69NEWS వరంగల్, జూన్ 21:
ఇజ్రాయిల్–పాలస్తీనా మరియు ఇరాన్ మీద జరుగుతున్న దాడులను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని, వెంటనే యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలు జరగాలని కోరుతున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అన్నారు.శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశం సిపిఎం జిల్లా కార్యాలయంలో,జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య అధ్యక్షతన జరిగింది.అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దాడులు చేస్తోందని,పసిపిల్లలు,మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు.భారత్‌పై ఉగ్రదాడులకు కారణమైన వారిని పట్టుకోలేకపోతున్న బిజెపి ప్రభుత్వం,యుద్ధం చేస్తామన్న హామీ నుండి ట్రంపు ఒత్తిడితో వెనక్కి తగ్గిందని అన్నారు.భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని,కేంద్ర ప్రభుత్వం శాంతియుత నిరసనలను అణచివేస్తోందని విమర్శించారు.ఆపరేషన్ కగార్” పేరిట నక్సలైట్లపై దాడులు చేసి మానవ హక్కులు లంఘిస్తున్నారని పేర్కొన్నారు.నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.కేంద్ర కార్మిక చట్టాల మార్పులపై స్పందిస్తూ,కార్మిక హక్కులు హరించడంతోపాటు కార్పొరేట్లకు మద్దతుగా విధానాలు కొనసాగిస్తున్నారన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని గూర్చి మాట్లాడుతూ..కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయడంలో విఫలమైందని,బడ్జెట్ లేదని చెప్పడం దురదృష్టకరమని పేర్కొన్నారు.గృహలక్ష్మి,కొత్త రేషన్ కార్డులు,ఇండ్ల స్థలాలు,పట్టాలు వంటి హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాన్ని నడిపించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జి.నాగయ్య,సింగారపు బాబు,రత్నమాల,సమ్మయ్య,కుమారస్వామి,దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.