
యుపిఎస్ గర్మిళ్లపల్లి: ఏడవ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్ళపల్లి యుపిఎస్ పాఠశాలలో బుధవారం ఏడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రజిత పాల్గొని,విద్యార్థులు పై తరగతుల్లో మంచి ఫలితాలు సాధించి భవిష్యత్ లో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,శేషగిరి,ఆరోగ్యమ్మ,పారిజాత,అశోక్,రఫీ,కుటుంబరావు,శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.