యువతని అభినందించిన ముప్పారం పంచాయతీ కార్యదర్శి
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో యువత ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆకారపు సురేష్ స్వయంగా యువతను కలిసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“రాజ్యాంగం మనకు ఇచ్చిన శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు.అసాంఘిక కార్యకలాపాలకు లోనై,డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేయొద్దు.గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంచి నాయకుడిని ఎంచుకుని ఓటు వేయాలి”అని యువతకు సూచించారు.