

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలలో మండల ఎస్ఐ సాకాపురం దివ్య పాల్గొని, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత ఉన్నత విద్య ,క్రీడలతో పాటు, భక్తి భావంతో ఆధ్యాత్మికత సంతరించుకునే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు.అలాగే స్నేహ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలు గా గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలను యూత్ అద్యక్షుడు ఆవుల రాజు ఎస్సై కి వివరించగా ఎస్సై గారు అభినందించారు.అనంతరం స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు ఎస్సై ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రఘుసాల తిరుపతి, స్నేహ యూత్ సీనియర్ సభ్యులు పకిడే కిరణ్, సుధనబోయిన విష్ణు యాదవ్, ఆకుల వెంకటేష్,స్నేహ యూత్ మాజీ అధ్యక్షులు కట్ల ప్రకాష్, మాజీ ఉపాధ్యక్షులు నేరెళ్ల బిక్షపతి, స్నేహ యూత్ ఉపాధ్యక్షుడు పప్పుల యువరాజు, లింగంపల్లి కృష్ణ, పకిడే అనిల్,రఘుసాల శ్రీకాంత్, భట్టు సాయి,రఘుసాల సూర్యతేజ, పకిడే హరీశ్, ఆవుల పవన్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.