ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండలంలో నూతనంగా ఏర్పడిన పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా నియమితులైన సాకాపురం దివ్య తాను బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే తనదైన శైలిలో ప్రజలకు మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.గోరి కొత్తపల్లి మండలం కోనరావు పేట గ్రామంలో మంగళవారం మండల ఎస్సై మహిళలకు రక్షణ, యువత మద్యం డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకూ దూరంగా ఉండాలనిప్రజలకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ... ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న సంప్రదించాలని, శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.బాధ్యతలు చేపట్టిన రెండో రోజు ప్రజల సమస్యల కోసం అడుగులు వేస్తున్న ఎస్సై ను పలువురు అభినందిస్తున్నారు.