
రాపర్తి ప్రభాకర్
రాపర్తి ప్రభాకర్
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ సికింద్రాబాద్ జోన్ తార్నాక డివిజన్ కమిటీ సమావేశం హనుమంతు అధ్యక్షతన జరిగింది. తార్నాక డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రజక ఆత్మగౌరవ సభ ను వచ్చే నెలలో 100 మందితో సభను నిర్వహించాలని కమిటీ తీర్మానం చేయడం జరిగింది
జిల్లా సహాయ కార్యదర్శి రాపర్తి ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా రజకులకు ఉచిత విద్యుత్ బకాయిల ను చెల్లించడంలో విఫలమైనది అని అన్నారు వందల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి వెంటనే చెల్లించాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రజకులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం డబుల్ బెడ్ రూమ్లలో రజకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలీ , నేటికీ రజకవృత్తిదారులపై గ్రామీణ, పట్టణ ప్రాంతంలో కుల వివక్షత, దౌర్జన్యాలు సామాజిక దాడులు పెత్తందారి వర్గాలచే కొనసాగుతున్నయని వాటి అరికట్టడానికి సామాజిక భద్రత ప్రత్యేక చట్టం కల్పించి ఆదుకోవాలి,
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేటికి రజక వృత్తిదారులకు కులవృత్తి జీవన ఆధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ నిరుపేదలు గా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే రజక వృత్తిదారులని ఆదుకోవడానికి రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి రూ:10 లక్షల వరకు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో:- సలయ్య, వెంకట్ రాజు, పరిపల్లి రాజు, పి రాజు, m నాగరాజు, పి ఆంజనేయులు,తదిరులు పాల్గొన్నారు