వరంగల్ లో రన్ ఫర్ జీసస్" శాంతిర్యాలీ
ఈ69 న్యూస్:-ఖిలావరంగల్ మండల పాస్టర్ల ఫెలోషిప్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ జీసస్” శాంతిర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు.డివైన్ గ్రేస్ అసెంబ్లీ వ్యవస్థాపకులు పాస్టర్ మెష్‌పాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.శంభునిపేట్ జంక్షన్ నుండి ప్రారంభమైన ర్యాలీ,ఎంజీఎం సెంటర్ గుండా మిషన్ ఆసుపత్రి వరకు జయజయహారాలతో సాగింది.హింసకు విరామం,ప్రేమకు ప్రాధాన్యం, మానవత్వానికి మద్దతు ఇవ్వాలనే సందేశంతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. పాస్టర్లు సామ్యూల్,సూర్య జడ్సన్,అరుణ్‌తో పాటు వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు,విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఈ ర్యాలీ నిర్వహించాలని వారు తెలిపారు.