
పాలడుగు నాగార్జున
పాలడుగు నాగార్జున
నల్లగొండ, మే 10:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్‌ను నిబంధనగా పెట్టడాన్ని KVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వలన అసలైన లబ్ధిదారులు అయిన పేద, దళిత, గిరిజన యువత పక్కకు నెట్టబడుతున్నారని అన్నారు. ఎంతో మంది యువతకు సిబిల్ స్కోర్ ఉండకపోవడంతో, వారు ఈ పథకం నుంచి తీరని నష్టాన్ని ఎదుర్కొంటారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్న ఈ నిబంధనను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.