రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ప్రతిభా పరీక్ష
తెలంగాణ,మహారాష్ట్ర ఆల్ ఫోర్స్ బ్రాంచీల పరిధిలో ఈ సంవత్సరం గాను తృతీయ తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ నెల 14వ తేదీన ప్రతిభా పరీక్ష నిర్వహించబడింది.ఈ పరీక్షలో ప్రతి తరగతి నుంచి ఫస్ట్, సెకండ్,థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేశారు.విజేతలకు ఫస్ట్ ప్రైజ్-రూ.5,000,సెకండ్ ప్రైజ్-రూ.3,000,థర్డ్ ప్రైజ్-రూ.2,000,నగదు బహుమతులు అందజేశారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండ,వరంగల్,జనగామ జిల్లాలకు చెందిన ఫస్ట్,సెకండ్,థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థినీ-విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా, జఫర్గడ్ మండలం తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ వహాబ్ (తండ్రి మహమ్మద్ యాకోబ్ పాషా) ఐదవ తరగతిలో సెకండ్ ర్యాంక్ సాధించి ప్రత్యేక అభినందనలు పొందాడు.ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ..విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇటువంటి పరీక్షలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలిపారు.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.