రాష్ట్ర ప్రభుత్వానికీ అమావాస్య చీకటే – వెలిశాల క్రిష్ణమాచారి
Kumuram Bheemకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని రమాదేవి గిరిజన జిల్లా అభివృద్ధి అధికారి గారికి మరియు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గారికి తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్ లో ఉన్న ఏడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని. పెండింగ్ లో ఉన్న సమ్మర్ క్యాంపు వేతనాలు కూడా చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది దీనికి స్పందించిన డి టి డి ఓ మరియు జిల్లా కలెక్టర్ గారు త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు తమ చరవాణి ద్వార ఐ టి డి ఏ పి ఓ గారికి ఫోన్లో వర్కర్ల సమస్యలన్ని తెలుపడం జరిగింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ వేతనాలు చెల్లించనున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ వెలిశాల క్రిష్ణమాచారి – తెలంగాణ గిరిజన ఆశ్రమపాఠశాలలు మరియు డైలీవేజీ,ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయక కార్యదర్శి గారు మాట్లాడుతూ గిరిజన హాస్టల్స్ వర్కర్లకు గత ఏడు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండడం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఇన్ని రోజులైన పట్టించు కోకుండ జిల్లా అధికారయంత్రాంగం మొద్దు నిద్రలో ఉందని మెలుకువకు వచ్చి వర్కర్ల పై దృష్టి సారించాలని అన్నారు. వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉండడం వలన పొలాల పండుగ, గిరిజన ఆదివాసులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగకు పిల్లల సైతం పస్తులు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల పండుగకి కార్మికులను కార్మిక కుటుంబాలను పస్తులు ఉంచకుండా వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. మరియు వర్కర్లు అతి తక్కువ వేతనాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉందని కనీస వేతనం 26000 రూపాయలు చెల్లించాలని. ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సంవత్సరానికి రెండు జతల యూనిఫాం, లు ఇవ్వాలని మరియు 12 నెలల వేతనం చెల్లించాలని. ఉద్యోగ భద్రత కల్పించాలని. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. డిమాండ్ చేశారు. కావున వెంటనే జిల్లా కలెక్టర్ గారు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గారు మరియు పై స్థాయి అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గెజిట్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.పోలాల అమావాస్య సంధర్భంగా ఆదివాసీ గిరిజన హాస్టల్ వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే రానున్న రోజుల్లో ఈ రాష్ర్ట ప్రభుత్వానికీ అమావాస్య చీకటేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ మరియు తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు ఆడ శ్యామ్ రావు జిల్లా కోశాధికారి మరప రాంబాయి ఉపాద్యక్షులు ప్రేమ దాస్ అరిగేల కోటయ్య సంతోష్ జంగు దేవి సముద్ర భాయి , జంగుదేవీ, నాగేశ్వరీ, శేఖర్ దిల్ దిల్దార్ కుడిమెత సంతోష్ , కన్ను బాయి, ఇతరులు పాల్గొన్నారు