రూ.10 వేల విలువైన క్రికెట్,చెస్ కిట్ల అందజేత
మండలంలోని తాటికొండ గ్రామానికి చెందిన యువకులు రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రీడలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేశారు.తాటికొండతో పాటు పరిసర గ్రామాలైన ఫతేపూర్,చిల్పూర్లలో నిర్వహించనున్న క్రికెట్ క్రీడా ఉత్సవాల సందర్భంగా గతంలో స్టేషన్ఘనపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ మసి కుమార్‌ను యువకులు సంప్రదించారు.ఈ మేరకు శుక్రవారం హనుమకొండలో రూ.10 వేల విలువైన క్రికెట్ కిట్‌తో పాటు చెస్ కిట్లను అందజేశారు.స్వయంగా క్రీడాకారుడైన కానిస్టేబుల్ కుమార్ క్రీడలపై ఉన్న మక్కువతో యువకులు ఫోన్ ద్వారా అభ్యర్థించగానే వెంటనే స్పందించి క్రీడా సామాగ్రిని అందించడం విశేషం.ఈ కార్యక్రమంలో తాటికొండ గ్రామానికి చెందిన మారపాక ఎల్ల స్వామి,అనంతపురం హరిప్రసాద్,మారపాక సందీప్,మారపాక నాగరాజ్ (ఎంఎన్ఆర్),మారపాక శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.క్రీడల అభివృద్ధికి తోడ్పడిన కానిస్టేబుల్ కుమార్‌కు ఈ సందర్భంగా వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు