రేగొండలో ఘనంగా మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు •వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Uncategorized
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండల కేంద్రంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి రెంటరాజన్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం సందర్భంగా ఈరోజు రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కట్ చేసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, కాంగ్రెస్ మహిళా మండల అధ్యక్షురాలు బూర్గుల ప్రమాదాదేవి, జిల్లా నాయకులు పున్నం రవి, మోడం ఉమేష్ గౌడ్, మైస బిక్షపతి, పట్టెం శంకర్, మ్యకల బిక్షపతి, ఏనుగు రవీందర్ రెడ్డి, సామల సురేందర్ రెడ్డి, కోలేపాక సాంబయ్య, రెంటాల సదానందం, మైస సంజీవ్, పొన్నగంటి వీరబ్రహ్మం, గండి తిరుపతి గౌడ్, జంగేటి సుధాకర్, ఎండి షాబీర్, ఎడ్ల మల్లారెడ్డి, ఎర్రబాటి రామారావు, మల్లయ్య, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.