భూపలపల్లి విఆర్ కు బదిలీ అయిన సందీప్ కుమార్

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండల నూతన ఎస్సైగా కే రాజేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన సందీప్ కుమార్ భూపాలపల్లి విఆర్ కు బదిలీ అయ్యారు.రామగుండం కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా విధులు నిర్వహించిన కే రాజేష్ బదిలీపై రేగొండకు వచ్చారు.భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు మంగళవారం రేగొండలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పనిచేస్తానని అన్నారు,ప్రజలు తనకు సహకరించాలని కోరారు, నేరాల నియంత్రణలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు.