మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని నియోజకవర్గం లోని అన్ని గ్రామాలనుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంక్యలొ పాల్గొని విజయవంతం చేయాలని,నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు 27 సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు డోర్నకల్ నియోజక వర్గంలోని మరిపెడ మండల కేంద్రములో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే భారీ బహిరంగ సభ కలదు.ఇట్టి బహిరంగ సభను చరిత్రలో కని విని ఎరుగని రీతిలో విజయ వంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు యుగంధర్ రెడ్డి, కోట వెంకటరెడ్డి,రవి నాయక్, ఐలమల్లు, సర్పంచ్ శ్రీను, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.