రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
Uncategorizedఅర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం:వల్లపురెడ్డి రామ్ రెడ్డి

ఈ69న్యూస్ ధర్మసాగర్, జూలై 25:
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా పేదల అభ్యున్నతికి కట్టుబడి పని చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మండల సమన్వయకర్త వల్లపురెడ్డి రామ్ రెడ్డి తెలిపారు.
ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలో శుక్రవారం రోజున అర్హత పొందిన పేద కుటుంబాలకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు వల్లపురెడ్డి రామ్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ,
“రేషన్ కార్డుల పంపిణీ ఒక నిరంతర ప్రక్రియ. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇది చేరాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది వేగవంతంగా జరుగుతోంది. పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్న ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డే అని అన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిరంతరం ఈ విషయంలో కృషి చేస్తున్నారు” అని తెలిపారు.
రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాజయ్య, మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమార్, మడికంటి వెంకటయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాషబోయిన రాజు, గంటే కృష్ణ, నాయకులు వక్కల కరుణాకర్, కుందేల్ల వెంకటేష్, యకయ్య, రాకేష్, డీలర్ రాజు, హరీష్ పాల్గొన్నారు.