ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు
•రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూలై 30
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కే.ఆర్.నాగరాజు రైతులకు అన్ని విధాలుగా అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు.పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, రిజర్వాయర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు.కాలువలకు నీరు రావడంతో రైతులకు వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పర్వతగిరి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని హామీ ఇచ్చారు.ఎల్.నీనో ప్రభావం ఉన్నప్పటికీ రైతుల కష్టాలు అర్థం చేసుకొని,సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించినట్లు చెప్పారు.స్థానికంగా కొంత మంది ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.రైతులకు సహాయం చేయలేని వారు నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.రైతులకు నిజంగా అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.అనంతరం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును నాయకులు,అధికారులతో కలిసి సందర్శించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సావిత్రి,సర్పంచ్ శంకర్,మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు,గ్రామ శాఖ అధ్యక్షుడు రాంచందర్,సర్పంచుల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ రైతు రాజు,సీనియర్ నాయకుడు సంపత్, నీటిపారుదల శాఖ అధికారులు,సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.