
సన్న వడ్లకు రూ.500 బోనస్ రైతులకు పెద్ద లాభం: ఎమ్మెల్యే నాగరాజు
ఈ69న్యూస్ వర్ధన్నపేట: రైతు బంధు, రైతు రుణ మాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్న వడ్లకు రూ.500 బోనస్ వల్ల రైతులకు ప్రత్యక్షంగా పెద్ద లాభం జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.TESCAB చైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ..ఈ బోనస్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుకు అందుతుందన్నారు.నందనం గ్రామానికి చెందిన జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములుకి లక్ష రూపాయల బోనస్ లభించిందని తెలిపారు.కాంగ్రెస్ సీనియర్ నేత రాయపురం సాంబయ్య మాట్లాడుతూ.. ఎంత మంచి పనులు చేసినా ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితమవుతాయని,కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి ప్రభుత్వ పథకాల గొప్పతనాన్ని తీసుకెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మెట మహేష్ గౌడ్,పార్టీ నాయకులు,అధికారులు పాల్గొన్నారు.