
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి-అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్
ఈ69న్యూస్ జనగామ:-బచ్చన్నపేట మండలంలోని కొడవటూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతం,టార్పాలిన్లు,గన్ని సంచుల లభ్యత వంటి మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి,తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు.అలాగే,ఓపీఎంఎస్లో నమోదు తక్షణమే చేయాలని,ఆలస్యం జరగకూడదని కేంద్ర సిబ్బందికి సూచనలు ఇచ్చారు.రైతులు ధాన్యాన్ని కేంద్రాల వద్దనే విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు.ఈ పరిశీలనలో డీటీసీఎస్ శ్రీనివాస్,ఇతర అధికారులు పాల్గొన్నారు.