ఈ69న్యూస్: నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం గొట్టుముక్కుల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగ మోహన్,ఇంటి నంబరు మరియు అసెస్మెంట్ నంబర్ల మంజూరుకు సంబంధించి ఫిర్యాదుదారుని వద్ద నుంచి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు.ఫిర్యాదుదారు సమాచారం మేరకు,ఏసీబీ అధికారులు పథకం ప్రకారం తనిఖీ నిర్వహించి,కార్యదర్శిని రూ.18,000 లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరినపుడు,వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించండి.టోల్ ఫ్రీ:1064 | వాట్సాప్: 9440446106ఫిర్యాదు వెబ్సైట్: acb.telangana.gov.inమీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.